: తలనొప్పి తగ్గించుకునేందుకు చిన్న చిట్కా

అనుకున్న పని జరగనప్పుడు టెన్షన్ పెరుగుతుంది. టెన్షన్ కారణంగా తలనొప్పి మొదలవుతుంది. దీని నుంచి ఉపశమనానికి చాలా మంది తలనొప్పి మందులు వాడుతుంటారు. ఒత్తిడి కారణంగా వచ్చిన తలనొప్పికి మందులు అవసరం లేదని, ఓ చిన్న చిట్కా పాటిస్తే తలనొప్పి మాయమవుతుందని బ్రిటన్ కు చెందిన అనెస్థటిస్ట్ డాక్టర్ జేన్ లియోనార్డ్ సూచిస్తున్నారు. ఒత్తిడితో వచ్చిన తలనొప్పితో బాధపడుతున్నప్పుడు మునిపళ్ల మధ్య పెన్సిల్ లాంటి వస్తువును పెట్టుకుని గట్టిగా కరిచిపట్టుకోవాలని సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల దవడ కండరాలు, కణతల వద్దనున్న కండరాలు రిలాక్స్ అయి నెమ్మదిగా తలనొప్పి తగ్గుతుందని వారు వెల్లడించారు.

More Telugu News