: శ్రీశాంత్, శ్రీశాన్వికల ఫోటోను చూసి 'సో క్యూట్' అన్న హర్భజన్ సింగ్

శ్రీశాంత్, హర్భజన్ సింగ్... గతంలో ఎన్నోమార్లు బహిరంగంగా గొడవ పడ్ద క్రికెటర్లు. 2008లో ఓ ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా శ్రీశాంత్ చెంప మీద హర్భజన్ లాగి ఒకటిచ్చుకోవడం పెను చర్చకే దారితీసింది. ఆపై శ్రీశాంత్ ఫిక్సింగ్ ఆరోపణల్లో ఇరుక్కుని ఆటకు దూరమైన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు, శ్రీశాంత్ తన కుమార్తె శ్రీశాన్సికను ఒళ్లో కూర్చోబెట్టుకుని కారు నడుపుతున్న ఓ ఫోటో సామాజిక మాధ్యమాల్లోకి ఎక్కగా, హర్భజన్ స్పందించాడు. "వారిద్దరికీ ఆశీస్సులు... సో క్యూట్" అని కామెంట్ చేశాడు. ఇక ఇదే చిత్రంపై మిశ్రమ స్పందన వెలువడింది. ఓ చిన్నారిని ఒళ్లో కూర్చోబెట్టుకుని కారు నడపడం బాధ్యతా రాహిత్యమని, చట్ట వ్యతిరేకమని విమర్శించిన వారూ ఉన్నారు. అయితే, తాను కారును నడపడం లేదని, తమ ఇంటి కాంపౌండ్ లోపలే ఉన్న తోటలో ఓ ఫోటోకిచ్చిన ఫోజు మాత్రమే అదని శ్రీశాంత్ వివరణ ఇచ్చాడు. ఏదైతేనేం, ముద్దుగా ఉన్న శ్రీశాన్విక, శ్రీశాంత్ ల చిత్రం ఇప్పుడు వైరల్.

More Telugu News