: పనితీరుకు ప్రోత్సాహకంగా సంస్థలో వాటా ఇస్తామంటున్న ఇన్ఫోసిస్

మంచి పనితీరుతో సంస్థ అభివృద్ధికి పాటుపడుతున్న ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉండేలా ఈక్విటీ వాటాలను ఇవ్వాలని ఇన్ఫోసిస్ నిర్ణయించుకుంది. 1990 దశకంలో ఐటీ విస్తరణ సాగుతున్న వేళ ఉద్యోగులకు స్టాక్ ఆప్షన్స్ ఇచ్చిన ఇన్ఫీ, తిరిగి ఇప్పుడు అదే దారిలో నడవనుంది. సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ప్రవీణ్ రావు ఈ విషయాన్ని వెల్లడించారు. "ఇండియాలో రెండవ అతిపెద్ద సాఫ్ట్ వేర్ ఎగుమతి సంస్థగా ఉన్న ఇన్ఫీ, కొత్త ఇన్సెంటివ్ ప్లాన్ అమలు చేయనుంది. ఇందులో భాగంగా వారికి ఈక్విటీలు పంచుతాం. అందుకోసం మొత్తం ఈక్విటీ వాటాల్లో ఒకటి నుంచి ఒకటిన్నర శాతం కేటాయిస్తాం" అని ఆయన తెలిపారు. ఉద్యోగులకు వాటాలను ఇచ్చే విషయంలో షేర్ హోల్డర్ల అనుమతి తప్పనిసరి కావడంతో త్వరలోనే సర్వసభ్య సమావేశం నిర్ణయించనున్నట్టు ప్రవీణ్ వెల్లడించారు.

More Telugu News