: షేర్లను భారీగా బైబ్యాక్ చేయనున్న అమెజాన్.కామ్

ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్.కామ్ తన షేర్లను భారీగా బైబ్యాక్ చేయనున్నట్టు ప్రకటించింది. బైబ్యాక్ పై నిర్ణయాన్ని అమెజాన్.కామ్ డైరెక్టర్ల బోర్డు నేడు ఖరారు చేసింది. 2010లో 2 బిలియన్ డాలర్ల షేర్లను బైబ్యాక్ చేయాలన్న నిర్ణయాన్ని అప్పట్లో వాయిదా వేసిన సంగతి తెలిసిందే. తాజాగా షేర్లు బైబ్యాక్ ప్రకటన వెలువడడంతో అమెజాన్.కాం ఎంత మొత్తం షేర్లను బైబ్యాక్ చేయనుందనే ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే ఈ బైబ్యాక్ చేసే షేర్ల విలువ సుమారు 5 మిలియన్ డాలర్ల విలువ ఉండే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. విశేషం ఏమిటంటే, అమెజాన్ నుంచి ఈ ప్రకటన వెలువడగానే అమెజాన్.కామ్ షేర్లు 1.5 శాతం పెరిగాయి.

More Telugu News