: సిక్కు-అమెరికన్ నటుడికి ఎయిర్ మెక్సికో క్షమాపణలు

సిక్కు-అమెరికన్ నటుడు వారిస్ అహ్లువాలియాకు ఎయిర్ మెక్సికో క్షమాపణలు చెప్పింది. రెండు రోజుల కిందట మెక్సికో ఎయిర్ పోర్టులో అహ్లువాలియా తలపాగా తీయాలంటూ భద్రతా సిబ్బంది కోరారు. అందుకాయన నిరాకరించడంతో విమాన ప్రయాణానికి సిబ్బంది అనుమతించలేదు. ఈ ఘటనను అమెరికా ఫ్యాషన్ డిజైనర్ల మండలి వర్గాలు తీవ్రంగా ఖండించగా, పలువురి నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. దాంతో ఆ విషయమై క్షమించమని కోరుతూ ఎయిర్ మెక్సికో ఇవాళ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఆయనకు కలిగిన అసౌకర్యానికి విచారం వ్యక్తం చేస్తున్నామని తెలిపింది. ప్రయాణికుల మత విశ్వాసాలను గౌరవించాలని, అన్ని మతాల వారిని ఒకేతీరుగా చూడాలని ఆ ప్రకటనలో పేర్కొంది.

More Telugu News