: మనుషుల భావోద్వేగాలను గుర్రాలూ గుర్తిస్తాయట!

మనుషుల భావోద్వేగాలను, హావభావాలను గుర్తించే సామర్థ్యం గుర్రాలకు ఉందట. న్యూయార్క్ లోని యూనివర్శిటీ ఆఫ్ సస్సెక్స్ ఇటీవల నిర్వహించిన తాజా అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. మనుషులు సంతోషంగా కానీ, కోపంగా కానీ వుంటే ఆ భావోద్వేగాలను గుర్రాలు ఇట్టే పసిగట్టగలవని చెప్పారు. ఈ అధ్యయనం నిమిత్తం సుమారు 28 దేశీయ గుర్రాలను ఉపయోగించారు. సంతోషం, కోపంగా ఉన్న వ్యక్తుల ఫొటోలను అధ్యయనకారులు తమ చేతులతో పట్టుకుని గుర్రాలకు చూపించారు. గుర్రాలు తమ ఎడమ కంటితో ఈ ఫొటోలను చూశాయి. కోపంతో ఉన్న వ్యక్తుల ఫొటోలను చూపెట్టినప్పుడు గుర్రాలు నెగటివ్ గా స్పందించాయని అధ్యయనకారులు పేర్కొన్నారు. జంతువుల్లో కుడి పక్కన ఉన్న మెదడు నియంత్రణ ద్వారా వాటి ఎడమ కన్ను పనిచేస్తుందని, నెగటివ్ గా స్పందించడానికి అదే కారణమని వారు పేర్కొన్నారు. అయితే, మనుషుల భావోద్వేగాలను గుర్తించడమనేది గుర్రానికి మాత్రమే ఉన్న అదనపు సామర్థ్యం అని అధ్యయనకారులు తెలిపారు.

More Telugu News