: సెల్ఫీ మరణాలు భారత్ లోనే అధికం!

సెల్ఫీలు దిగుతూ ప్రాణాలు పోగొట్టుకునే వారి సంఖ్య భారతదేశంలో అధికంగా ఉంది. ఈ విషయాన్ని స్టాటిస్తా అనే సంస్థ వెల్లడించింది. సెల్ఫీలు దిగేవారు ఏ దేశాల్లో ఎక్కువగా ఉన్నారు, సెల్ఫీలు దిగుతున్న సందర్భాల్లో ఏ కారణల వల్ల చనిపోయారు? అనే అంశంపై ఈ సంస్థ అధ్యయనం చేసింది. ప్రపంచం మొత్తంలో చూస్తే సెల్ఫీల కారణంగా ప్రమాదవశాత్తు చనిపోయిన వారి సంఖ్య భారత్ లోనే అధికంగా ఉందని వెల్లడించింది. 2012 నుంచి 2014 మధ్య కాలంలో ప్రపంచ వ్యాప్తంగా సెల్ఫీ మృతుల సంఖ్య 49. మృతులందరూ 21 సంవత్సరాలలోపు వారే. అందులో 36 మంది అబ్బాయిలు కాగా, 13 మంది అమ్మాయిలు ఉన్నారు. ఆ జాబితా వివరాలు..భారత్ -19, రష్యా-7, అమెరికా-5, స్పెయిన్-4, ఫిలిప్పీన్స్-4, పోర్చుగల్-2, ఇండోనేషియా-2, దక్షిణాఫ్రికా-1, రొమేనియా-1, పాకిస్థాన్-1, మెక్సికో-1, ఇటలీ-1, చైనాలో ఒక్కరు మృతి చెందారు. కాగా, ఈ నలభై తొమ్మిది మందిలో చాలా ఎత్తులో నుంచి పడిపోయి, నీటిలో మునిగిపోయిన వారు కొందరైతే, కారు, రైలు, విమాన, తుపాకీ ప్రమాదాల్లోను, జంతువుల కారణంగాను ప్రాణాలు కోల్పోయిన వారు ఇంకొందరు.

More Telugu News