: గ్రేటర్ లో సీట్లు రాకున్నా ఓట్లను పెంచుకున్న తెలుగుదేశం...లోకేశ్ విశ్లేషణ!

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికల్లో ఘోరంగా ఓటమిని చవిచూసి కేవలం ఒకే ఒక్క డివిజన్ కు పరిమితమైన తెలుగుదేశం పార్టీకి, గత ఎన్నికలతో పోలిస్తే లక్షన్నర ఓట్లు అధికంగా రావడం గమనార్హం. ఇదే విషయాన్ని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మీడియాకు వెల్లడిస్తూ, ప్రజల్లో పార్టీ బలపడిందని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం అక్కర్లేదని అభిప్రాయపడ్డారు. తక్కువ శాతం పోలింగ్ జరిగినప్పటికీ తమకు ఏడున్నర లక్షల ఓట్లు వచ్చాయని గుర్తు చేశారు. తెరాస పార్టీ నేతలు అమలుకు సాధ్యం కాని విధంగా రూ. 40 వేల కోట్లు ఖర్చయ్యేలా హామీలిచ్చారని, వాటిని ఎలా అమలు చేస్తారో చూడాలని వుందని లోకేశ్ అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలను టీ-20 క్రికెట్ పోటీలతో పోల్చిన లోకేశ్, తెలుగుదేశాన్ని టెస్టు మ్యాచ్ లను ఆడగల సత్తా ఉన్న పార్టీగా అభివర్ణిస్తూ, ఓ టీ-20లో ఓడిపోతే, టెస్టుల అనుభవం, సత్తా ఎక్కడికీ పోయినట్టు కాదని అన్నారు.

More Telugu News