: ఉగ్రవాదుల దాడి నుంచి తప్పించుకున్న భారత ప్రాంతాలివే!

ముంబైపై ఉగ్రవాదులు దాడి చేయడానికి పూర్వం, తాము ఏఏ ప్రాంతాల్లో దాడులు చేసి మారణహోమం సృష్టించవచ్చన్న విషయమై ముష్కరులు పెద్ద ప్లానే వేశారు. అమెరికా జైల్లో శిక్షనుభవిస్తూ, ముంబై ప్రత్యేక కోర్టుకు వాంగ్మూలమిస్తున్న డేవిడ్ హెడ్లీ వెల్లడించిన వివరాల ప్రకారం, ఇండియాలోని పలు ప్రాంతాలపై దాడులకు ప్లాన్ చేసిన ఐఎస్ఐ తదుపరి దానిని విరమించుకుంది. నావెల్ ఎయిర్ స్టేషన్, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్, పోలీస్ హెడ్ క్వార్టర్స్, ముంబై సిద్ధి వినాయక టెంపుల్ తదితరాలను పరిశీలించినప్పటికీ, ఆయా ప్రాంతాల్లో ఉన్న హై సెక్యూరిటీ కారణంగా వెనుకంజ వేసినట్టు హెడ్లీ తెలిపాడు. తాను 2006 ఫిబ్రవరి 22న, 2006 సెప్టెంబర్ 14న, 2007 మార్చి 26న, 2007 సెప్టెంబర్ 4న, 2009 ఏప్రిల్ 9న కరాచీ నుంచి ఇండియాకు వచ్చానని, 2008 జూలై 1న లాహోర్ నుంచి వచ్చానని, మరోసారి అబూదాబీ నుంచి వచ్చినట్టు హెడ్లీ వెల్లడించాడు. నవంబరు 2008లో ఉగ్రదాడుల తరువాత ఏ ప్రాంతంలో ఎంత సెక్యూరిటీ ఉంటుందన్న విషయమై నిత్యమూ సమీక్షలు జరిపినట్టు హెడ్లీ వెల్లడించాడు.

More Telugu News