: మహిళా టెక్కీ అనుశ్రీ ఆచూకీ లభ్యం... పటాన్ చెరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైనం

హైదరాబాదులో నిన్న కలకలం రేపిన మహిళా టెక్కీ అనుశ్రీ అదృశ్యం కేసు మిస్టరీ ఎట్టకేలకు వీడింది. ఆదిభట్లలోని టీసీఎస్ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్న అనుశ్రీ నిన్న తానుంటున్న వుమెన్స్ హాస్టల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కనిపించకుండాపోయింది. ఆమె ఆచూకీ గల్లంతుపై ఆందోళన చెందిన ఆమె తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిన్న రాత్రే రంగంలోకి దిగిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. హాస్టల్ నుంచి అనుశ్రీ బయటకు వెళుతున్న సీసీటీవీ ఫుటేజీ దృశ్యాలను పరిశీలించిన పోలీసులు ఆమె తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్లు గుర్తించారు. ఈ దిశగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు కొద్దిసేపటి క్రితం అనుశ్రీ ఆచూకీ లభ్యమైంది. పటాన్ చెరు పరిధిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమెను పోలీసులు గుర్తించారు. ఏ కారణం చేత ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోందన్న విషయం తెలియరాలేదు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

More Telugu News