: ఇండియాతో కలిసి చైనాపై ఓ కన్నేస్తాం: అమెరికా

దక్షిణ చైనా సముద్రంలో చైనా జరుపుతున్న కార్యకలాపాలపై గట్టి నిఘాను ఉంచేందుకు భారత్ తో కలసి పనిచేయనున్నట్టు అమెరికా వెల్లడించింది. భారత నావికాదళంతో కలసి పెట్రోలింగ్ ఈ సంవత్సరంలోనే ప్రారంభిస్తామని అమెరికా రక్షణ శాఖ అధికారి ఒకరు తెలిపారు. ఈ మేరకు చర్చలు జరుగుతున్నాయని, ఇండియా తమకు మిత్ర దేశంగా ఉండటం, సౌత్ చైనా సముద్రంలోకి వారి నౌకలు తరచూ వెళ్లి వస్తుంటడం తమకు లాభిస్తుందని తెలిపారు. ఇటీవలి కాలంలో ఇరు దేశాల మధ్య రక్షణ బంధం బలపడిందని గుర్తు చేశారు. తాజా చర్చల అనంతరం చైనాపై సంయుక్త నిఘా ఉంటుందని రాయ్ టర్స్ వార్తా సంస్థకు వెల్లడించిన ఆ అధికారి, తన పేరును ప్రచురించేందుకు మాత్రం నిరాకరించారు. కాగా, ఈ విషయం చైనాకు ఆగ్రహాన్ని తెప్పించేదేనని విశ్లేషకులు వ్యాఖ్యానించారు. దక్షిణ చైనా సముద్రంలో అత్యధిక భాగం తమ పరిధిలోనిదేనని వాదిస్తున్న ఆ దేశం, కృత్రిమ దీవులను నిర్మించి, భారీ ఎత్తున యుద్ధ నౌకలను మోహరిస్తున్న సంగతి తెలిసిందే.

More Telugu News