: అమెరికాలో అత్యధిక మొత్తాన్ని అందుకున్న సీఈఓగా సుందర్ పిచాయ్

అమెరికాలోని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లలో అత్యధిక మొత్తాన్ని ప్రతిఫలంగా అందుకున్న వ్యక్తిగా గూగుల్ చీఫ్ సుందర్ పిచాయ్ నిలిచారు. గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ కు చెందిన 2,73,328 ఈక్విటీ వాటాలను (విలువ సుమారు 199 మిలియన్ డాలర్లు - రూ. రూ. 1,350 కోట్లు) ఇచ్చింది. దీంతో సంస్థలో ఆయన వాటాల విలువ 650 మిలియన్ డాలర్లకు (సుమారు రూ. 4,400 కోట్లు) పెరిగింది. క్రెడిట్ సూస్ క్యాలిక్యులేషన్స్ ప్రకారం, ఒక అమెరికన్ సరాసరి ఆస్తి విలువకు ఇది 14,400 రెట్లు అధికం. కాగా, ప్రస్తుతం సుందర్ కు గూగుల్ లో ఉన్న వాటా చాలా స్వల్పమనే చెప్పుకోవాలి. గూగుల్ వ్యవస్థాపకులు లారీ పేజ్ కి 34.6 బిలియన్ డాలర్లు, సెర్గి బ్రిన్ కు 33.9 బిలియన్ డాలర్ల వాటా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సంవత్సరంలో సుందర్ పిచాయ్ తో పాటు ఆల్ఫాబెట్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ రుత్ పోరాట్ కు 38 మిలియన్ డాలర్ల విలువైన ఈక్విటీలను, అదనంగా మరో 30 మిలియన్ డాలర్ల బోనస్ ను గూగుల్ అందించింది. గూగుల్ క్లౌడ్ కంప్యూటింగ్ వ్యాపారాన్ని నిర్వహిస్తున్న డియానే గ్రేనీకి 42.8 మిలియన్ డాలర్ల విలువైన షేర్లను ఇచ్చింది.

More Telugu News