: వ్యాయామం చేస్తున్నా.. గంటలకొద్దీ కూర్చుంటే షుగర్ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువేనట!

క్రమం తప్పకుండా వ్యాయామం చేసే అలవాటున్నప్పటికీ .. గంటలకొద్దీ అదే పనిగా కూర్చుంటే డయాబెటీస్ (మధుమేహం) వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పరిశోధకులు గుర్తించారు. నెదర్లాండ్స్ పరిశోధకులు నిర్వహించిన తాజా అధ్యయనంలో ఈ విషయాన్ని గుర్తించారు. పరిశోధకుడు జులియానే వాండర్ బెర్గ్ ప్రకారం, కదలికల్లేకుండా కూర్చునే ప్రతి అదనపు గంటతో టైప్-2 మధుమేహం ముప్పు 22 శాతం దాకా పెరుగుతుందని చెబుతున్నారు. కంప్యూటర్ పై పనిచేయడం, కుర్చీలో కూర్చోవడం వంటివి ఉదాహరణలుగా ఆయన చెప్పారు. ఈ సందర్భంగా మరో విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు.. కూర్చోవడం వల్లే డయాబెటిస్ వస్తుందనే విషయం నిరూపితం కాలేదని అన్నారు. కాకపోతే, కూర్చోవడం-డయాబెటిస్ మధ్య సంబంధం మాత్రం కచ్చితంగా ఉందని వాండర్ బెర్గ్ తెలిపారు.

More Telugu News