: సింహం దూకింది... నాలుగు నెలల గరిష్ఠానికి పెరిగిన భారత ఉత్పత్తి రంగం!

'మేకిన్ ఇండియా' సింహం గర్జించడం ప్రారంభించింది. ప్రధాని మోదీ తీసుకున్న పలు నిర్ణయాల ఫలితాలు కనిపించడం ప్రారంభించాయి. 2016 తొలి నెలలో ఉత్పత్తి రంగంలో వృద్ధి నాలుగు నెలల గరిష్ఠ స్థాయికి చేరింది. జనవరి నెలలో మాన్యుఫాక్చరింగ్ పీఎంఐ (పర్చేజ్ మేనేజింగ్ ఇండెక్స్) డిసెంబరుతో పోలిస్తే 49.1 నుంచి 51.1 పాయింట్లకు పెరిగింది. పీఎంఐ 50 పాయింట్లను దాటడం సెప్టెంబరు తరువాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. సోమవారం వెల్లడైన గణాంకాల ప్రకారం, ఇండియాలో కొత్త వ్యాపారాల ప్రారంభం గణనీయంగా మెరుగుపడింది. ముఖ్యంగా కన్స్యూమర్ గూడ్స్, దాని అనుబంధ రంగాల్లో ఎన్నో కంపెనీలు ముందడుగు వేశాయి. ఈ రంగంలోని కంపెనీల్లో కొత్త పెట్టుబడులు వచ్చాయి. ప్రొడక్షన్ వాల్యూముల్లో సైతం వృద్ధి నమోదైంది. కొత్త ఉద్యోగాల సృష్టి పరంగా జనవరి ఒకింత వెనకడుగు వేసినప్పటికీ, భవిష్యత్తుపై మంచి అంచనాలు ఏర్పడ్డాయని కేంద్ర గణాంకాల శాఖ వ్యాఖ్యానించింది.

More Telugu News