: వైశ్యుల్లో ఎంజైమ్ లోపం.. శస్త్రచికిత్సల సమయంలో సమస్యలు!

వైశ్యుల్లో బ్యుటిరైల్ కోలీనీస్టరేస్ అనే ఎంజైమ్ లోపం కారణంగా శస్త్రచికిత్స సమయంలో వారికి మత్తు మందును ఇచ్చినప్పుడు సమస్యలు తలెత్తుతాయని పరిశోధకులు వెల్లడించారు. ఆపరేషన్ తర్వాత వారు మళ్లీ స్పృహలోకి రావడం కోసమని వారికిచ్చే మందులు పనిచేయవని తెలిపారు. బ్యుటిరైల్ కోలీనీస్టరేస్ అనే ఎంజైమ్ లోపం కారణంగానే ఈ సమస్యలు తలెత్తుతున్న విషయం జన్యు పరీక్షల ద్వారా తేలిందని సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నస్టిక్స్(సీడీఎఫ్ డీ) పరిశోధకులు తెలిపారు. వైశ్యులపై నిర్వహించిన పరిశోధనా ఫలితాల్లో పలు ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయన్నారు. విజయవాడ, విశాఖపట్టణం ప్రాంతాలకు చెందిన వైశ్యుల నుంచి సేకరించిన కొందరి నమూనాల్లో ఈ ఎంజైమ్ లోపం ఉందన్నారు. దీని కారణంగా శస్త్రచికిత్స తర్వాత కూడా వారిపై మత్తు ప్రభావం ఉంటుందని.. దీంతో స్పృహలోకి రాలేక చనిపోతున్నారని పరిశోధకులు చెప్పారు. వారికి మత్తు మందు ఇచ్చే సమయంలో ప్రత్యేక పద్ధతులును కనుక పాటిస్తే వారు బతికే అవకాశముంటుందన్నారు. ఆపరేషన్ విజయవంతం కాకపోవడం వల్లే వారు మరణిస్తున్నారని ఇన్నాళ్లూ భావించారని పరిశోధకులు అన్నారు.

More Telugu News