: వరల్డ్ టాప్ 50 కుబేరుల్లో ముగ్గురు ఇండియన్స్... హవా కొనసాగించిన ముఖేశ్ అంబానీ

ప్రపంచ కుబేరుల్లో భారతీయ పారిశ్రామిక దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ తన హవాను కొనసాగిస్తున్నారు. చాలా కాలంగా వరల్డ్ టాప్ 50 ధనవంతుల జాబితాలో చోటు దక్కించుకుంటున్న ఆయన ఈ ఏడాది కూడా సత్తా చాటారు. ‘వెల్త్- ఎక్స్’ సంస్థ ‘బిజినెస్ ఇన్ సైడర్’తో కలిసి నిన్న విడుదల చేసిన వరల్డ్ టాప్ 50 కుబేరుల జాబితాలో అంబానీ 27వ స్థానంలో నిలిచారు. ముఖేశ్ ఆస్తిని 24.8 బిలియన్ డాలర్లుగా ఆ నివేదిక పేర్కొంది. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ అగ్రభాగాన నిలిచిన ఈ జాబితాలో భారత్ కు చెందిన మరో ఇద్దరు భారతీయ పారిశ్రామికవేత్తలు కూడా స్థానం సంపాదించారు. విప్రో అధినేత అజీం ప్రేమ్ జీ... 16.5 బిలియన్ డాలర్లతో 43వ స్థానంలో నిలవగా, సన్ ఫార్మా అధినేత దిలీప్ సంఘ్వీ ... 16.4 బిలియన్ డాలర్లతో 44వ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. జాబితాలో టాప్ లో నిలిచిన బిల్ గేట్స్ ఆస్తి విలువ 87.4 బిలియన్ డాలర్లుగా ఉంది.

More Telugu News