: నష్టాన్ని ఆపే శక్తి ఇండియాకు లేదు: మూడీస్

ఇతర అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలతో పోలిస్తే, భారత మార్కెట్ మూలాలు బలంగా ఉన్నప్పటికీ, ఇతర దేశాల్లో దిగజారుతున్న మార్కెట్లను ఆపే శక్తి మాత్రం లేదని ప్రముఖ రీసెర్చ్ సంస్థ మూడీస్ అభిప్రాయపడింది. ఇతర దేశాల కారణంగా ఏర్పడే ఇబ్బందులకు ఇండియా సైతం తలవంచాల్సిందేనని మూడీస్ నిర్వహించిన ఓ పోల్ లో అత్యధికులు అభిప్రాయపడ్డారు. ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లు రిస్క్ లో ఉండగా, ఆ ప్రభావం ఇండియాపైనా ఉంటుందని పోల్ వివరాలతో కూడిన మూడీస్ నివేదిక పేర్కొంది. వచ్చే ఏడాది నుంచి ఏడాదిన్నర కాలంలో భారత జీడీపీ 6.5 నుంచి 7.5 శాతం మధ్య ఉంటుందని, నిపుణులు అంచనా వేస్తున్నారు. భారత ఎకానమీ ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లలో విదేశాల నుంచి వచ్చే షాకింగ్ న్యూస్ ఒకటని పోల్ లో పాల్గొన్న 35 శాతం మంది అభిప్రాయపడ్డారు. అయితే, నష్టపోయినప్పటికీ, రికవరీ ప్రారంభమైతే, మిగతా దేశాల కన్నా వేగంగా సెన్సెక్స్, నిఫ్టీలు దూసుకెళ్తాయని వారు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వచ్చే 18 నెలల కాలంలో ఆస్తుల విలువ తగ్గుతుందని 40 శాతం మంది వెల్లడించగా, పబ్లిక్ సెక్టార్ సంస్థల పనితీరు నిదానిస్తుందని 89 శాతం మంది పేర్కొనడం గమనార్హం.

More Telugu News