: సంగీత ప్రియులకు యాపిల్ కానుక!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ 'యాపిల్' సంస్థ నుంచి సంగీతానికి సంబంధించి 'మ్యూజిక్ మెమోస్' పేరుతో ఓ యాప్ విడుదలైంది. మనం పాడుకునే పాటను, ఇంకా పియానో, గిటార్ వంటి వాయిద్యాల సంగీతాన్ని ఈ యాప్ తో రికార్డు చేసుకోవచ్చు. ఆ తర్వాత దీనికి ఎలాంటి నేపథ్య సంగీతం సరిపోతుందో ఈ యాప్ ద్వారా ప్రయత్నించవచ్చు. పలు రకాల డ్రమ్స్ నుంచి వచ్చే సౌండ్ ట్రాక్ లను దానికి కలుపుకోవచ్చు. ఇంకా మనకు కావలసిన టెంపో మార్చుకునే సదుపాయాన్ని కూడా ఈ యాప్ అందిస్తుంది. ఆ తర్వాత దీనంతటినీ మళ్లీ ఓ సారి విని, కావాలంటే మనకు అక్కర్లేని మ్యూజిక్ ని ఇందులోంచి తీసేయచ్చు. అలా మన మనసుకు నచ్చేలా మధురమైన మన పాటను ఈ యాప్ సాయంతో రికార్డ్ చేసుకోవచ్చు. సంగీత సాధన చేస్తున్న వారికి, గాయకులకు బాగా ఉపయోగపడే ఈ ఐఓఎస్ యాప్ ను ఉచితంగా యాప్ స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

More Telugu News