ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

భార్యను మెప్పించేందుకు ఐదు వంటగది చిట్కాలు!

Fri, Jan 22, 2016, 12:56 PM
Related Image ఉదయాన్నే భార్యకు ప్రేమతో కప్పు కాఫీ కలిపిచ్చినా, బయటి నుంచి వచ్చే సరికి పలహారం సిద్ధం చేసినా, ఆ భర్తపై భార్యకున్న ప్రేమ, అనురాగం మరింతగా పెరుగుతాయి. జీవిత భాగస్వామికి వంటగదిలో అందించే ఆ చిరు సాయం ఇద్దరి మధ్యా మరింత బంధానికి మార్గంగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. అందుకోసం కష్టపడి వంట నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఈ ఐదు చిట్కాలు వంటబట్టించుకుంటే చాలు!
* కాఫీ, టీ తయారు: పాలు స్టౌ మీద పెట్టి వాటిని వేడి చేసి కాఫీపొడి, పంచదార కలిపితే వేడివేడి కాఫీ తయారవుతుంది. కాఫీ లేదంటే టీ... తయారు చేయడం సులభమే. ఎటొచ్చీ ఎంత పంచదార, పొడి వేయాలన్నదానిపై అవగాహన పెంచుకుంటే చాలు
* కిచన్ లో వాడే పరికరాలు, ఏ సామాను ఎక్కడ ఉంటుందన్న విషయమై కొంత తెలుసుకుని ఉంటే మంచిది. భార్య వంట చేస్తున్నప్పుడు అవసరానికి ఏదో ఒకటి అందించినా, ఇద్దరి మధ్యా అనురాగం పెరుగుతుంది.
* ఏదైనా మీ స్పెషల్ వంట: సతీమణి ఎన్నడూ చేయని ఓ వంటకం గురించి కాస్తంత రీసెర్చ్ చేసి, అది ఎలా తయారు చేయాలో నేర్చుకోండి. దీంతో జీవిత భాగస్వామిని ఎంతో ఇంప్రెస్ చేయవచ్చు. అయితే, చేసిన వంటకాన్ని భార్యకు పెట్టే ముందు రుచి చూడాలి సుమా! ఒకటికి రెండు సార్లు వండితే, ఏ వంటకమైనా రుచిగానే వస్తుంది.
* వడ్డించడమూ ముఖ్యమే: ఏదైనా ఓ స్పెషల్ వంటను చేసిన తరువాత, దానికి మరింత అందాన్నిచ్చేలా అలంకరణ... అంటే గార్నిష్ చేయడంలోనూ కాస్తంత ప్రత్యేకత చూపాలి. ఇక ఏ రాత్రయితే డిన్నర్ సమయంలో మీదైన ఓ స్పెషల్ వంట ఉంటే, ఆ రాత్రి మరింత మధురానుభూతులను మిగుల్చుకోవచ్చు.
* భార్యకు సహాయం: వంటలో ఏ మాత్రం కాస్తంత ప్రవేశమున్నా భార్యకు కిచన్ లో ఎంతో సహాయం చేయవచ్చు. కూరగాయలు తరగడం నుంచి బియ్యం కడగడం వరకూ ఏ పని చేసి పెట్టినా, ఆ కాస్త సమయం మరింత ముద్దు, ముచ్చట్లకు ఆదా చేసుకున్నట్టే కదా!
X

Feedback Form

Your IP address: 54.166.48.3
Articles (Latest)
Articles (Education)