: వైదొలగుతున్న టాప్ హెడ్స్... కష్టాల్లో యాపిల్ ఇండియా!

ఇండియాలో వ్యాపార కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు కొత్త బాస్ లను వెతుక్కోవాల్సిన పరిస్థితి టెక్ జెయింట్ యాపిల్ ముందు సవాలుగా నిలిచింది. సంస్థ అమ్మకాలను కోట్ల రూపాయల నుంచి వేల కోట్లకు చేర్చిన యాపిల్ దీర్ఘకాల భారత మేనేజర్, ఏఓఎల్ మాజీ ఎగ్జిక్యూటివ్ మనీష్ ధిర్ తన పదవికి రాజీనామా చేశారు. గడచిన నెల రోజుల వ్యవధిలో యాపిల్ భారత విభాగాన్ని వీడి వెళ్లిన రెండో ఉన్నతోద్యోగి మనీష్. కంపెనీలో ఎంటర్ ప్రైజ్ మొబిలిటీ యూనిట్ ను పర్యవేక్షించే శరద్ మెహరోత్రా ఇటీవల తన పదవికి రాజీనామా చేసి వైవీ మొబిలిటీ పేరిట సొంత సెల్ ఫోన్ కంపెనీని పెట్టుకున్న సంగతి తెలిసిందే. కాగా, తన రాజీనామా విషయమై ప్రత్యేకించి స్పందించేందుకు నిరాకరించిన మనీష్ ధిర్, రాజీనామా మాత్రం వాస్తవమని తెలిపారు. 2010లో ఆయన విధుల్లోకి వచ్చినప్పుడు 100 మిలియన్ డాలర్లుగా (సుమారు రూ. 670 కోట్లు) ఉన్న యాపిల్ అమ్మకాలు ఆయన పదవిని వీడే సరికి బిలియన్ డాలర్లను (సుమారు రూ. 6,700 కోట్లు) అధిగమించాయి. యాపిల్ స్వీయ బ్రాండెడ్ స్టోర్లను ఇండియాలో ప్రారంభించడం ద్వారా మరింతగా విస్తరించాలని ప్రణాళికలు రూపొందిస్తున్న వేళ, ధిర్ రాజీనామా కొంత ఇబ్బందికరమేనని నిపుణులు అంచనా వేస్తున్నారు.

More Telugu News