: రెండేళ్ల కనిష్టానికి రూపాయి మారకం విలువ... డాలర్ కు 68 మార్కును తాకిన వైనం

డ్రాగన్ దెబ్బకు ప్రపంచ మార్కెట్ల మాదిరే భారత మార్కెట్లు కూడా భారీగా ప్రభావితమయ్యాయి. నేటి ఉదయం 400 పాయింట్లకు పైగా పతనమైన స్థాయిలో బాంబే స్టాక్ ఎక్సేంజీ ప్రారంభమైంది. నిఫ్టీ కూడా 140 పాయింట్లకు పైగా పతనంతో ఆరంభమైంది. ఇక మొన్నటిదాకా కాస్తంత బలంగానే కనిపించిన రూపాయి మారకం విలువ నేడు భారీ స్థాయిలో పతనమైంది. ప్రస్తుతం డాలర్ కు రూపాయి మారకం విలువ 68 మార్కును తాకింది. 2013లో రూపాయి మారకం విలువ 68 మార్కుకు చేరింది. తాజాగా రూపాయి మారకం 68 మార్కుకు చేరడంతో రూపాయి మారకం విలువ మూడేళ్ల కనిష్ట స్థాయికి చేరినట్లైంది.

More Telugu News