: ఇండియాలో మిలియనీర్ల సంఖ్య 2.36 లక్షలు

గడచిన రెండేళ్ల వ్యవధిలో ఇండియాలో మిలియనీర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఆసియా పసిఫిక్ 2016 సంపద నివేదిక ప్రకారం, ప్రస్తుతం భారత్ లో 2.36 లక్షల మంది మిలియనీర్లు ఉండగా, ఈ రీజియన్లో అత్యధిక సంపదను కలిగివున్న వారి సంఖ్య పరంగా ఇండియా నాలుగో స్థానంలో నిలిచింది. జపాన్ లో అత్యధికంగా 12.60 లక్షల మంది ధనవంతులు ఉండగా, చైనాలో 6.54 లక్షల మంది, ఆస్ట్రేలియాలో 2.90 లక్షల మంది మిలియనీర్లు ఉన్నారని నివేదిక విడుదల చేసిన న్యూ వరల్డ్ వెల్త్ వెల్లడించింది. ఈ జాబితాలో సింగపూర్ 2.24 లక్షల మందితో ఐదవ స్థానంలో నిలువగా, ఆపై హాంకాంగ్ (2.15 లఫలు), సౌత్ కొరియా (1.25 లక్షలు), తైవాన్ (98,200), న్యూజిలాండ్ (89 వేలు), ఇండోనేషియా (48,500)లు టాప్-10లో నిలిచాయి. చైనాలో ధనవంతుల ఆస్తి మొత్తం రూ. 11.56 కోట్ల కోట్లు కాగా, భారత ధనవంతుల వద్ద రూ. 2.92 కోట్ల కోట్ల సంపద ఉందని నివేదిక పేర్కొంది.

More Telugu News