: నింగికేగనున్న పీఎస్ఎల్వీ-సీ31... స్వదేశీ నావిగేషన్ వ్యవస్థ పరిపూర్ణమే లక్ష్యం

భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం (ఇస్రో) మరో కీలక ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. రెండు రోజుల క్రితం కౌంట్ డౌన్ ప్రారంభమైన పీఎస్ఎల్వీ-సీ31 మరికాసేపట్లో నింగిలోకి దూసుకెళ్లనుంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్ కేంద్రం నుంచి నింగిలోకి దూసుకెళ్లనున్న ఈ ఉపగ్రహ వాహక నౌక ఐఆర్ఎన్ఎస్ఎస్-1ఎఫ్ ను అంతరిక్ష కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది. స్వదేశీ నావిగేషన్ వ్యవస్థ ఏర్పాటు కోసం ఇప్పటికే ప్రయోగించిన ఉపగ్రహాలకు ఐఆర్ఎన్ఎస్ఎస్-1ఎఫ్ జత చేరనుంది. దీంతో స్వదేశీ నావిగేషన్ వ్యవస్థ మరింత పటిష్టం కానుంది. స్వదేశీ నావిగేషన్ వ్యవస్థ కోసం మార్చిలో ప్రయోగించనున్న మరో రెండు ఉపగ్రహాలకు, ఇప్పటికే ప్రయోగించిన ఉపగ్రహాలకు ఐఆర్ఎన్ఎస్ఎస్-1ఎఫ్ వారధిగా మారనుంది. మార్చిలో ప్రయోగించనున్న రెండు ఉపగ్రహాలతో స్వదేశీ నావిగేషన్ వ్యవస్థ పరిపూర్ణం కానుంది.

More Telugu News