: 'బాదుడే బాదుడు' మార్గంలో మోదీ సర్కారు... తగ్గాల్సిన పెట్రోలు ధర పెరిగింది!

గడచిన రెండు నెలల కాలంలో పెట్రో ఉత్పత్తులపై నాలుగోసారి ఎక్సైజ్ సుంకాన్ని మోదీ సర్కారు వడ్డించింది. అంతర్జాతీయ మార్కెట్లో 30 డాలర్లకన్నా దిగువకు క్రూడాయిల్ ధరలు చేరుకున్న వేళ, శుక్రవారం నాడు పెట్రోలుపై 32 పైసలు, డీజెల్ పై 85 పైసల మేరకు ధరలను తగ్గిస్తున్నట్టు ఓఎంసీ (ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ)లు ప్రకటించగా, ఆ వెంటనే మరోసారి పన్నులను పెంచుతున్నట్టు వాణిజ్య శాఖ వెల్లడించింది. పెట్రోలుపై 75 పైసలు, డీజెల్ పై రూ. 1.83 పన్ను విధిస్తున్నట్టు ఆదేశాలు వెలువరించింది. అంతకుముందు జనవరి 1న, డిసెంబర్ మొదటి, మూడవ వారాల్లో సైతం పెట్రో ఉత్పత్తుల ధరలు తగ్గగా, ఆ వెంటనే ఎక్సైజ్ సుంకాలు పెరిగిన సంగతి తెలిసిందే. ఈ తాజా పన్ను పెంపుతో కేంద్రానికి అదనంగా రూ. 3,700 కోట్ల ఆదాయం రానుంది. ఇక తగ్గిన ధరతో పోలిస్తే పన్ను బాదుడే అధికంగా ఉండటంతో, ఇండియాలో పెట్రోలు ధర పెరిగినట్లయింది.

More Telugu News