: ఇండియాలోని క్రెడిట్ కార్డుల్లో సగానికి పైగా హెచ్డీఎఫ్సీవే!

భారత్ లోని ప్రైవేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ, క్రెడిట్ కార్డ్ మార్కెట్లో ప్రభుత్వ రంగ బ్యాంకులనూ అధిగమించి అత్యధిక మార్కెట్ వాటాను సొంతం చేసుకుంది. ఇండియాలో వాడకంలో ఉన్న క్రెడిట్ కార్డుల్లో 52 శాతం హెచ్డీఎఫ్సీ ఇచ్చినవే కావడం గమనార్హం. "నవంబరు 2015తో మా క్రెడిట్ కార్డ్ బుక్ సైజ్ రూ. 20 వేల కోట్లను అధిగమించింది. మొత్తం మార్కెట్ షేర్ లో ఇది 52 శాతం. ఇండియాలో కార్డుల ద్వారా తీసుకున్న రుణాల మొత్తం రూ. 39 వేల కోట్లు" అని బ్యాంకులో కార్డ్స్, మర్చంట్ అక్వయిరింగ్ వ్యాపారా విభాగ హెడ్ పరాగ్ రావు వివరించారు. కాగా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గణాంకాల ప్రకారం, అక్టోబరు నాటికి దేశంలో 67.20 లక్షల క్రెడిట్ కార్డులున్నాయి. వీటిలోని హెచ్డీఎఫ్సీ కార్డుల ద్వారా అక్టోబరులో రూ. 6,820 కోట్ల విలువైన వ్యాపారం జరిగింది. ఇదిలావుండగా, నెలకు 75 వేల నుంచి 80 వేల వరకూ కొత్త కార్డులను జారీ చేస్తున్నామని పరాగ్ రావు తెలియజేశారు.

More Telugu News