: కుదేలైన టీసీఎస్...ఏడాదిన్నర కనిష్ఠానికి ఈక్విటి!

డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో అంతంతమాత్రపు ఆర్థిక ఫలితాలను నమోదు చేసిన భారత నంబర్ వన్ ఐటీ సేవల సంస్థ టీసీఎస్ ఈక్విటీ వాటా విలువ ఏడాదిన్నర కనిష్ఠానికి పతనమైంది. విశ్లేషకుల అంచనాలను మించి నికర లాభాలు తగ్గడమే ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను దిగజార్చిందని నిపుణులు వ్యాఖ్యానించారు. బుధవారం నాటి సెషన్లో సంస్థ ఈక్విటీ క్రితం ముగింపుతో పోలిస్తే 2 శాతం పడిపోయి రూ. 2,285కు చేరింది. కాగా, అక్టోబర్ - డిసెంబర్ మధ్య కాలంలో సంస్థ నెట్ ప్రాఫిట్ కేవలం 0.90 శాతం వృద్ధితో సరిపెట్టుకోగా, ఆదాయం 0.73 శాతం వృద్ధికి పరిమితమైంది.

More Telugu News