: 52 వారాల కనిష్ఠానికి ఎల్ అండ్ టీ, ఎస్బీఐ, బీహెచ్ఈఎల్, యాక్సిస్, ఐసీఐసీఐ!

ఓవైపు చైనా భయాలు, మరోవైపు క్రూడాయిల్ ధరల పతనం... ఇండియాలో సంస్కరణల అమలు జాప్యం, ద్రవ్యోల్బణం... కారణాలేమైతేనేమి, భారత స్టాక్ మార్కెట్ నష్టాలు కొనసాగగా, దిగ్గజ కంపెనీల ఈక్విటీలు 52 వారాల కనిష్ఠస్థాయికి పడిపోయాయి. మార్చి 2015 స్థాయితో పోలిస్తే 17 శాతం పతనమైన బెంచ్ మార్క్ సూచికలు మరింతగా దిగజారవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక నేటి సెషన్లో ఎల్ అండ్ టీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బీహెచ్ఈఎల్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి కీలక కంపెనీల ఈక్విటీ విలువ కుదేలైంది. వీటితో పాటు ఐడియా సెల్యులార్, అలహాబాద్ బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్, బజాజ్ ఎలక్ట్రికల్స్, కెనరా బ్యాంక్, డీసీబీ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్, ఇండియా ఇన్ ఫ్రా, ఇంటర్ వరల్డ్, ఐఓబీ, కర్ణాటక బ్యాంక్, ఎన్డీటీవీ, నెస్టిల్, పీఎన్బీ, సింటెక్స్, పెన్నార్ ఇంజనీరింగ్, ఓరియంటల్ బ్యాంక్, జికామ్, యూనియన్ బ్యాంక్ తదితర కంపెనీల ఈక్విటీలు 52 వారాల కనిష్ఠ స్థాయిలో కదలాడుతున్నాయి.

More Telugu News