: చలిని తట్టుకోవడానికి 'వింటర్ డైట్' ఇదిగో!

చలికాలం అందర్నీ గజగజ వణికించేస్తోంది. మారిన ఈ వాతావరణానికి శరీరంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో విటమిన్లతో కూడిన ఆహారం తీసుకోవడం అత్యవసరమని వైద్యులు చెబుతున్నారు. అలాగే ఈ సీజన్ లో మనం తీసుకునే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలని సూచిస్తున్నారు. పంచదారకు ప్రత్యామ్నాయంగా తేనెను వినియోగించడం వలన ఈ సీజన్ లో శరీరానికి త్వరగా ఇన్ఫెక్షన్లు సోకవట. ఒక గ్లాసుడు గోరువెచ్చని నీటిలో తేనెను వేసుకుని ప్రతీ రోజూ తాగడం మంచిదని వైద్యులు సలహా ఇస్తున్నారు. అలాగే ఆకుకూరలను, కేరెట్, బీట్ రూట్ లాంటి దుంపలను వినియోగించాలి. విటమిన్ సి అధికంగా గల ఆరెంజ్, గ్రేప్ లాంటివి అధికంగా తీసుకోవాలి. వీటితో పాటు ప్రతినిత్యం వంటల్లో వెల్లుల్లి వాడకాన్ని పెంచాలని వైద్యులు తెలియజేస్తున్నారు.

More Telugu News