: స్టార్టప్ లకు బూస్ట్!... రూ.10 కోట్లతో ‘ఇఫ్ కో’ నిధి

దేశీయ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు శుభవార్త. దేశీయ ఎరువుల ఉత్పత్తి దిగ్గజం ‘ఇఫ్ కో’ రూ.10 కోట్లతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసింది. వ్యవసాయ రంగంలో సరికొత్త ఐడియాలకు ఊపిరులూదడమే కాక కొంగొత్త ఆవిష్కరణలకు జవసత్వాలు నిలిపేందుకే ఈ నిధిని ఏర్పాటు చేసినట్లు ఆ సంస్థ ప్రకటించింది. కొత్త ఐడియాలతో ముందుకు వచ్చే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు దన్నుగా నిలిచేందుకే ఈ నిధిని ఏర్పాటు చేసినట్లు ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ యూఎస్ అవస్థి నేడు విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించారు. రైతులకు ఉపయోగపడే ఆవిష్కరణలకే ప్రాధాన్యమిస్తున్నప్పటికీ ఇతర రంగాలకు కూడా సాయమందించేందుకు వెనుకాడబోమని ఆయన ప్రకటించారు. భవిష్యత్తులో అవసరమనుకుంటే ఇందుకోసం మరిన్ని నిధులను వెచ్చించేందుకు సిద్ధమేనని అవస్థి తెలిపారు.

More Telugu News