: ఆ లెక్క ప్రకారం... ఇండియాలో మినరల్ వాటర్ కన్నా ఆయిల్ చౌక!

అవును... మీరు చదివింది అక్షర సత్యం. ఇండియాలో మినరల్ వాటర్ బాటిల్ కన్నా పెట్రోలు చౌకగా ఉండాలి. అసలు లెక్కైతేనే సుమా! కానీ మన ప్రభుత్వాల పుణ్యమాని ఆ ధర లభించడం లేదుగానీ, లేకుంటేనా... అంతర్జాతీయ స్థాయి క్రూడాయిల్ ధరల సరళిని అనుసరించి లెక్కిస్తే, లీటరుముడి చమురు ధర 12 రూపాయలు మాత్రమే. ఎలాగంటే... ప్రస్తుతం భారత క్రూడాయిల్ బాస్కెట్ ధర బ్యారలుకు 29.24 డాలర్లు (సుమారు రూ. 1,956 - డాలర్ తో రూపాయి మారకపు విలువ రూ. 66.90పై) ఒక బ్యారల్ లో 159 లీటర్ల ఆయిల్ వస్తుంది. ప్రస్తుతం లీటరు మినరల్ వాటర్ బాటిల్ ను రూ. 20కి అమ్ముతున్న సంగతి తెలిసిందే. ఇక లీటర్ ఆయిల్ అంటే, కేవలం రూ. 12.30కే లభిస్తున్నట్టు. అంతర్జాతీయ స్థాయిలో ముడి చమురు ధరలు 70 శాతం తగ్గితే, ఇండియాలో పెట్రోలు, డీజెల్ ధరలు 20 శాతం మాత్రమే తగ్గాయి. 2015-16 సంవత్సరంలో పెట్రోలుపై రూ. 7.73, డీజెల్ పై రూ. 7.83 మేరకు పన్నులను వడ్డించిన కేంద్రం, ధరల తగ్గుదల లాభాన్ని ప్రజలకు అందకుండా చేసింది. కాగా, క్రూడాయిల్ ధరలు భవిష్యత్తులో బ్యారల్ కు 20 డాలర్ల వరకూ దిగిరావచ్చని గోల్డ్ మన్ సాక్స్ అంచనా వేస్తోంది.

More Telugu News