: ఎల్జీ నుంచి పేపర్ లా చుట్టేసే ఓఎల్ఈడీ స్క్రీన్!

సాంకేతికత నానాటికి అభివృద్ధి చెందుతుండటంతో కొత్త రకాల ఎలక్ట్రానిక్ వస్తువులు మార్కెట్ లోకి వస్తున్నాయి. ఇదే కోవలో ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ ఎల్జీ తాజాగా కొత్త తరహా స్క్రీన్ ను మార్కెట్ లోకి విడుదల చేసింది. దాని ప్రత్యేకత ఏంటంటే... స్క్రీన్ ను పేపర్ ను చుట్టినట్టుగా చుట్టేయవచ్చు. అమెరికాలోని లాస్ వేగాస్ లో జరుగుతున్న సీఈఎస్-2016 షో కోసం ఎల్జీ ఈ రకం 18 అంగుళాల ఓఎల్ఈడీ స్క్రీన్ ను ఆవిష్కరించింది. ప్రపంచంలోనే ఇదే మొదటి బెండబుల్ డిస్ ప్లే అని సంస్థ ప్రతినిధులు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి డిస్ ప్లేలదే రాజ్యం కాబోతోందని చెప్పారు. దాంతో పాటు రెండు వైపులా వీడియో ఇమేజెస్ ప్రదర్శించగలిగే అత్యంత పలుచని డబుల్ సైడెడ్ డిస్ ప్లేను కూడా సంస్థ టెక్నాలజీ షోలో ప్రదర్శనకు ఉంచింది. వాటితో పాటు హై డైనమిక్ రిజల్యూషన్ ఉన్న ఓఎల్ ఈడీ టీవీ ప్యానల్స్ ను ఎల్ జీ విడుదల చేసింది.

More Telugu News