: మరో బ్లాక్ మండే!, 500 పాయింట్ల నష్టంలో భారత మార్కెట్... లక్షన్నర కోట్ల రూపాయలు ఆవిరి!

భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో మరో బ్లాక్ మండే నమోదు కానుంది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, చైనా మాంద్యం, ఇండియాలో పఠాన్ కోట్ పై ఉగ్రవాదుల దాడి... కారణాలు ఏవైతేనేం, ఇటీవలి కాలంలో ఎన్నడూ లేని విధంగా సోమవారం నాటి భారత స్టాక్ మార్కెట్ నష్టపోయింది. దాదాపు లక్షన్నర కోట్ల రూపాయల భారత ఇన్వెస్టర్ల సంపద హారతి కర్పూరమైంది. ఈ ఉదయం నష్టాల్లో ప్రారంభమైన సెన్సెక్స్, నిఫ్టీ, ఆపై మరింత నష్టాల్లోకి, మధ్యాహ్నం తరువాత పాతాళానికి జారిపోయాయి. మధ్యాహ్నం 3 గంటల సమయంలో సెన్సెక్స్ సూచిక క్రితం ముగింపుతో పోలిస్తే, 503 పాయింట్లు నష్టపోయి 25,657 పాయింట్ల వద్ద, నిఫ్టీ 163 పాయింట్ల పతనంతో 7,799 పాయింట్ల వద్దా కొనసాగుతున్నాయి. నిఫ్టీ-50లో కేవలం 4 కంపెనీలు మాత్రమే లాభాల్లో ఉన్నాయి. గతవారం చివర్లో మార్కెట్ కాప్ తో పోలిస్తే, ఇప్పటికే దాదాపు రూ. లక్షన్నర కోట్ల ఇన్వెస్టర్ల సంపద హారతి కర్పూరమైంది.

More Telugu News