: టాప్-30 'సూపర్ సిటీ'లలో రెండు ఇండియన్ సిటీలు

ప్రపంచంలోని 'సూపర్ సిటీ'ల జాబితాను రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ జేఎల్ఎల్ ప్రకటించగా, అందులో రెండు భారత నగరాలకు స్థానం లభించింది. అత్యంత శక్తిమంతమైన, ఉత్పాదకత, సులువుగా చేరగల ప్రాతిపదికన వీటిని ఎంపిక చేయగా, వీటిలో ముంబై, ఢిల్లీ నగరాలు చోటు సంపాదించుకున్నాయి. ముంబై 22వ ర్యాంకులో, ఢిల్లీ 24వ ర్యాంకులో నిలిచాయని జేఎల్ఎల్ ప్రకటించింది. ఈ జాబితాలో తొలి స్థానంలో టోక్యో నిలువగా, న్యూయార్క్, లండన్, పారిస్ నగరాలు టాప్ 4 సూపర్ సిటీస్ లో నిలిచాయి. ప్రపంచవ్యాప్తంగా 50 శాతం వరకూ ఫారిన్ ఇన్వెస్ట్ మెంట్స్ ఈ నగరాలకే వెళ్తున్నాయని వెల్లడించింది. ఇక శరవేగంగా మెరుగుపడుతున్న టాప్-10 నగరాల్లో ముంబై నిలిచింది. ఈ నగరాల్లో వాణిజ్య పరమైన ఆకర్షణ ఉందని తెలిపింది. ఈ 'ఇంప్రూవర్స్' జాబితాలో మిలన్ (ఇటలీ), ఇస్తాంబుల్ (టర్కీ), తెహ్రాన్ (ఇరాన్), మాడ్రిడ్ (స్పెయిన్), కైరో (ఈజిప్ట్), రియాద్ (సౌదీ అరేబియా), లాగోస్ (నైజీరియా), జకార్తా (ఇండొనేషియా), జెడ్డా (సౌదీ అరేబియా)లు నిలిచాయి. ఇక గత మూడేళ్లలో ముంబై నగరం సాలీనా 7 శాతానికి పైగా వృద్ధిని నమోదు చేసిందని జేఎల్ఎల్ పేర్కొంది. ప్రపంచంలోని 2 వేల అతిపెద్ద కంపెనీల్లో అత్యధికం ముంబైలో కార్యకలాపాలు సాగిస్తున్నాయని వెల్లడించింది.

More Telugu News