: మరో సెషన్ లో ఆదుకున్న యూరప్!

యూరప్ మార్కెట్ల నుంచి అందిన సంకేతాలు ఇన్వెస్టర్ల సెంటిమెంటును పెంచడంతో భారత స్టాక్ మార్కెట్ లాభాలు కొనసాగాయి. సెషన్ ఆరంభం నుంచి నష్టాల్లో సాగిన సూచికలు, మధ్యాహ్నం ఒంటిగంట తరువాత లాభాల్లోకి దూసుకెళ్లాయి. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు ఉత్సాహంగా కొనుగోళ్లు జరిపారు. శుక్రవారం నాటి సెషన్ ముగిసేసరికి బీఎస్ఈ సెన్సెక్స్ సూచిక 43.36 పాయింట్లు పెరిగి 0.17 శాతం లాభంతో 26,160.90 పాయింట్ల వద్దకు, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక నిఫ్టీ 16.85 పాయింట్లు పెరిగి 0.21 శాతం లాభంతో 7,963.20 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్ 0.92 శాతం, స్మాల్ క్యాప్ 0.88 శాతం లాభపడ్డాయి. ఎన్ఎస్ఈ-50లో 26 కంపెనీలు లాభాల్లో నడిచాయి. బోష్ లిమిటెడ్, టాటా మోటార్స్, అదానీ పోర్ట్స్, వీఈడీఎల్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ తదితర కంపెనీలు లాభపడగా, గెయిల్, హెచ్సీఎల్ టెక్, ఎన్టీపీసీ, టాటా స్టీల్, జడ్ఈఈఎల్ తదితర కంపెనీల ఈక్విటీలు నష్టపోయాయి. బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్, రూ. 1,00,93,3953 కోట్లకు చేరుకుంది. మొత్తం 2,946 కంపెనీల ఈక్విటీలు ట్రేడ్ కాగా, 1,986 కంపెనీలు లాభాలను, 833 కంపెనీల ఈక్విటీలు నష్టాలను నమోదు చేశాయి.

More Telugu News