: వాస్తు పాటిస్తే లక్ష్మీ తాండవం!

జీవించేందుకు సౌకర్యవంతమైన ఇల్లు ఉండాలని కోరుకోని వారు అసలుండరు. ఇదే సమయంలో సొంతింటి కలను నెరవేర్చుకునే దిశగా అడుగులు వేసే వేళ, వాస్తుకు చెందిన 5 పంచతత్వాలు, 16 మహావాస్తు జోన్లను పరిగణనలోకి తీసుకుని ఇల్లు కట్టుకుంటే, లక్ష్మీదేవి కొలువవుతుందని, సంపద సృష్టికి మార్గాలు సుగమమవుతాయని వాస్తు పండితులు చెబుతున్నారు. వాస్తు విద్వాంసులు చెప్పే మహావాస్తు శాస్త్రంలోని కొన్ని ముఖ్యాంశాలివి. * వాస్తు సక్రమంగా ఉన్న గృహాలు నిత్యమూ కళకళలాడుతాయి. ఇంట్లోని వారికి ధనప్రాప్తి, ఆరోగ్యం దగ్గరగా ఉంటాయి. * ఇంటి ఉత్తర ప్రాంతంలో నీలి రంగు వేయాలి. ఇక్కడ వంటగది, టాయ్ లెట్లు ఉండాలని మరువద్దు. ఈ ప్రాంతంలో చెత్తడబ్బా, చీపిరి, వాషింగ్ మెషీన్ లను ఉంచవద్దు. వంటగది అంటే అగ్నిదేవుడు కొలువై ఉండే ప్రాంతం. ఏదైనా వస్తువులు తప్పుడు స్థానంలో ఉంచితే, డబ్బు నీళ్లలా ఖర్చవుతుంది. కెరీర్ అవకాశాలు దెబ్బతింటాయి. * ఓ ఆకుపచ్చని ఫ్లవర్ వాజ్ లో మనీ ప్లాంటును పెంచుతుండండి. ఓ పచ్చని దట్టమైన అడవిని సూచించే సీనరీని ఉంచితే, అది డబ్బు ఇల్లు చేర్చేందుకు సహకరిస్తుంది. * ఇక ఈశాన్య ప్రాంతం ఎంతో ముఖ్యమైనది. ఈ జోన్ లో నిబంధనలు పాటిస్తే, బ్యాంకుల నుంచి సులువుగా రుణాలందుతాయి. ఇతరుల నుంచి పెట్టుబడులూ వస్తాయి. * ఇంటి ప్రధాన ద్వారం అందంగా ఉంటే సంతోషంతో పాటు శ్రేయస్సూ సిద్ధిస్తుంది. ఇంటికి పచ్చని తోరణాలు మంచి రంగులు, గడపకు పసుపు కుంకాలతో సంఘంలో గౌరవం పెరుగుతుంది. కష్టాలు దూరం జరుగుతాయి. ఉదాహరణకు వాయవ్యంలో తలుపుంటే రుణాలు, ఆర్థిక సమస్యలు వస్తాయి. ఉత్తరంలో ద్వారముంటే, మంచి కెరీర్, ఆర్థిక స్థిరత్వం సుసాధ్యం. తూర్పున తలుపున్న ఇంట శాంతి సిద్ధిస్తుంది. పశ్చిమాన తలుపుంటే ధనలాభాలు తలుపు తడుతాయి. దక్షిణాన తలుపున్నా మంచిదే. * ఆగ్నేయాన వంటగది ఉండాలి. లేత ఎరుపు, నారింజ, గులాబీ రంగులు సూచించే కలర్స్ వేస్తే మంచిది. బీరువా, పని చేసుకునే టేబుల్, డ్రాయింగ్ రూం తదితరాలు ఉత్తరం వైపున ఉంటే సరిపడినంత ధనం లభించే అవకాశాలుంటాయి. * పడమరవైపున తెలుపు, పసుపు రంగులు శుభసూచకం. ఇక ఇంట్లోని నైరుతీ ప్రాంతం సేవింగ్స్ ను సూచిస్తుంటుంది. కాబట్టి ఈ ప్రాంతం పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పిల్లల చదువులకు వినియోగించవచ్చు.ఈ ప్రాంతంలో బీరువాను ఉంచి డబ్బు, ఇతర విలువైన వస్తువులు ఉంచితే అవి కలకాలం సేఫ్ గా ఉంటాయి. * మహావాస్తులోని 4 నిబంధనలకు అనుగుణంగా ఇంట్లో ఎటువంటి మార్పులు చేయాలన్నది పరిశీలించి అసమతుల్యత ఉన్న చోట్ల సరిదిద్దుకుంటే భవిష్యత్ బంగారమవుతుంది. ఈ నిబంధనలు పాటిస్తే, ఇంట్లోని పాజిటివ్ ఎనర్జీ సమతూకంగా ఉంటూ సుఖశాంతులు, సౌభాగ్యాలు వెల్లివిరుస్తాయి. (వాస్తు పండితులు సూచించిన కొన్ని సిద్ధాంతాల అనుసరించి అందిస్తున్న వివరాలివి. వీటిని పాటించడమన్నది వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)

More Telugu News