: కార్యరంగంలోకి మరో వారసుడు!... అదానీ పోర్ట్స్ సీఈఓగా కరణ్ అదానీ

దేశీయ కార్పోరేట్ విపణిలోకి మరో వారసుడొచ్చాడు. అదానీ గ్రూపు సంస్థల అధినేత గౌతం అదానీ పుత్రరత్నం కరణ్ అదానీ, గ్రూపు సంస్థల్లోని అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ)గా కీలక బాధ్యతలు చేపట్టారు. ఈ పదవిలో మొన్నటిదాకా కొనసాగిన సుదీప్త భట్టాచార్య ఇటీవల చేసిన రాజీనామాను ఆమోదించిన అదానీ గ్రూపు డైరెక్టర్ల బోర్డు ఆ పోస్టులో కరణ్ అదానీని నియమిస్తూ ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంది. గుజరాత్ లో దిగ్గజ వ్యాపారవేత్తగా ఎదిగిన గౌతం అదానీ ప్రధాని నరేంద్ర మోదీకి అత్యంత సన్నిహితుడిగా పేరుగాంచారు. 27 ఏళ్ల వయస్సున్న కరణ్ అమెరికాలోని పర్డూ వర్సిటీ నుంచి ఆర్థిక శాస్త్రంలో డిగ్రీ పూర్తి చేశారు. 2009లోనే కంపెనీలో ఎంటరైన ఆయన తమ గ్రూపులోని పోర్ట్స్ కార్యకలాపాలను పరిశీలిస్తూ వచ్చారు. తాజాగా అదే విభాగం సీఈఓగా బాధ్యతలు చేపట్టిన కరణ్ ఏ మేరకు రాణిస్తారో చూడాలి.

More Telugu News