: కాంతి సాయంతో డేటా బట్వాడా... 'అల్ట్రాఫాస్ట్' ప్రాసెసర్ వచ్చేస్తోంది!

అత్యంత అధునాతన 'అల్ట్రాఫాస్ట్' ప్రాసెసర్ తయారైంది. కాలిఫోర్నియా యూనివర్శిటీ రీసెర్చర్లు, ఎలక్ట్రానులు, ఫోటాన్ల మధ్య బంధాన్ని ఏర్పరచి, కాంతి సాయంతో, అంతే వేగంతో డేటా బట్వాడాను చేయగల సింగిల్ చిప్ మైక్రో ప్రాసెసర్ ను అభివృద్ధి చేశారు. ఈ విధానంలో అతి తక్కువ డేటా వినియోగిస్తూ, అత్యధికంగా సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవచ్చని రీసెర్చర్ వ్లాదిమిర్ స్టోజానోవిక్ వివరించారు. "కాంతి ఆధారిత ప్రాసెసర్ అందుబాటులోకి రావడం ఇదే తొలిసారి. 7 కోట్లకు పైగా ట్రాన్సిస్టర్లు, 850 ఫోటానిక్ కాంపోనెంట్లను 3 మిల్లీ మీటర్ల వెడల్పు, 6 మిల్లీ మీటర్ల పొడవైన చిప్ లో విజయవంతంగా ఇన్ స్టాల్ చేయడం ద్వారా ఈ ప్రాసెసర్ తయారైంది" అని వ్లాదిమిర్ తెలిపారు. లిడార్ (లైట్ రాడార్ టెక్నాలజీ)లో వాడుతున్న టెక్నాలజీని ఇందులో వాడామని, సెల్ఫ్ డ్రైవింగ్ వాహనాలు, బ్రెయిన్ అల్ట్రాసౌండ్ ఇమేజింగ్, బయోసెన్సార్లు, స్మార్ట్ ఫోన్ల భవిష్యత్ పనితీరు ఈ ప్రాసెసర్లతో గణనీయమైన మార్పు చెందనుందని వివరించారు.

More Telugu News