: రూ. 28 వేల కోట్లు లాభపడ్డ టాప్-10 కంపెనీలు

గతవారంలో భారత స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ అవుతున్న టాప్ - 10 కంపెనీలు రూ. 28,382.58 కోట్ల మేరకు లాభపడ్డాయి. ప్రభుత్వ రంగ ఒఎన్జీసీ అత్యధికంగా రూ. 9,154.37 కోట్లు లాభపడగా, సంస్థ ఈక్విటీ రూ. 2 లక్షల కోట్లను అధిగమించింది. ఆపై ఐటీసీ రూ. 4,779 కోట్లు, కోల్ ఇండియా రూ. 3,695 కోట్లు, టీసీఎస్ రూ. 3,330 కోట్లు, రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ. 2,866 కోట్లు, ఇన్ఫోసిస్ రూ. 2,273 కోట్లు, హిందుస్థాన్ యూనీ లీవర్ రూ. 898 కోట్లు, హెచ్డీఎఫ్సీ రూ. 805 కోట్లు, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రూ. 315 కోట్లు, సన్ ఫార్మా రూ. 264 కోట్ల మేరకు లాభాలను నమోదు చేసి, తమ మార్కెట్ కాపిటలైజేషన్ ను పెంచుకున్నాయి. ఇక టాప్-10 ర్యాంకింగ్స్ లో వరుసగా టీసీఎస్, రిలయన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐటీసీ, ఇన్ఫోసిస్, కోల్ ఇండియా, ఓఎన్జీసీ, హెచ్డీఎఫ్సీ, సన్ ఫార్మా, హెచ్ యూఎల్ కంపెనీలు నిలిచాయి. ఈ వారంలో బెంచ్ మార్క్ ఇండెక్స్ సెన్సెక్స్ సూచిక 319.49 పాయింట్లు పెరిగి 25,838.71 పాయింట్లకు చేరింది.

More Telugu News