: మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు

ఈ వారం మధ్యలో తగ్గిన బంగారం ధరలు మరోసారి పెరిగాయి. శుక్రవారం నాటి బులియన్ మార్కెట్ సెషన్లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర క్రితం ముగింపుతో పోలిస్తే రూ. 125 పెరిగి రూ. 25,675కు చేరింది. ఆభరణాల తయారీదారులు, జ్యూయెలర్ల నుంచి వచ్చిన కొనుగోలు మద్దతే ఇందుకు కారణమని బాంబే బులియన్ అసోసియేషన్ వర్గాలు వెల్లడించాయి. ఇక గోల్డ్ ఫ్యూచర్స్ మార్కెట్లో ఫిబ్రవరి 5న డెలివరీ అయ్యే బంగారం ధర రూ. 145 పెరిగి రూ. 25,212కు చేరింది. కిలో వెండి ధర ఈ సెషన్లో రూ. 25 పెరిగి రూ. 34,325కు చేరింది. మార్చి 4న డెలివరీ అయ్యే కిలో వెండి ధర రూ. 130 పెరిగి రూ. 34,354కు చేరుకుంది. అటు ఇంటర్నేషనల్ మార్కెట్లో మాత్రం నేడు క్రిస్మస్ సందర్భంగా బులియన్ మార్కెట్లకు సెలవు. ఇండియాలో స్టాక్ మార్కెట్లకు కూడా సెలవు.

More Telugu News