: సన్ ఫార్మాస్యుటికల్ కు అమెరికా వార్నింగ్!

ఇండియాలో అతిపెద్ద ఔషధ తయారీ సంస్థగా ఉన్న సన్ ఫార్మాస్యుటికల్స్ ను యూఎస్ ఎఫ్డీఏ హెచ్చరించింది. హలోల్ లో సంస్థ నిర్వహిస్తున్న ప్లాంటులో నిబంధనలను పాటించడం లేదని, అమెరికాకు ఎగుమతి చేస్తున్న పలు రకాల ఫార్ములేషన్స్, ఇంజక్షన్లు ఇంటర్నేషనల్ స్థాయి నిబంధనలకు అనుగుణంగా లేవని తన వార్నింగ్ లెటర్ లో పేర్కొంది. గత సంవత్సరం సెప్టెంబరులో ఎఫ్డీఏ అధికారులు హలోల్ ప్లాంటును సందర్శించి, మొత్తం 23 అంశాలపై సన్ ఫార్మాను హెచ్చరించారు. ఆపై తయారై యూఎస్ కు వచ్చిన ఔషధాలకు పూర్తి పరీక్షలు జరిపి, ఇప్పుడీ హెచ్చరికలు జారీ చేసినట్టు తెలుస్తోంది. కాగా, గత నెలలో రెడ్డీస్ ల్యాబొరేటరీస్ కి సైతం ఇదే విధమైన వార్నింగ్ రాగా, ఈక్విటీ మార్కెట్లో రెడ్డీస్ వాటా విలువ 20 శాతానికి పైగా నష్టపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సన్ ఫార్మాకు అతిపెద్ద విదేశీ మార్కెట్ గా ఉన్న యూఎస్ నుంచి భారీగా ఆదాయం వస్తోంది. ఇదిలావుండగా, యూఎస్ ఎఫ్డీఏ హెచ్చరికలపై సన్ ఫార్మా స్పందిస్తూ, తాము అన్ని క్వాలిటీ నిబంధనలూ పాటిస్తున్నామని, అమెరికా ఆరోపణలపై మరింత స్పష్టత కోసం విదేశీ కన్సల్టెంట్ల సహాయం తీసుకోనున్నామని వెల్లడించింది.

More Telugu News