: ఈ ఆవిష్కరణతో స్మార్ట్ ఫోన్ ధరలు ఇక దిగివస్తాయి!

స్మార్ట్ ఫోన్ ధరలు ఆకాశాన్ని అంటడం వెనుక కారణం ఏంటో తెలుసా? స్మార్ట్ ఫోన్ లో ఉండే పానెల్, బాడీ, ఐసీలు, ఆయోడ్లు, ప్రాసెసర్లు, చిప్ తదితర ఎలక్రానిక్ వస్తువుల ధరలు మరీ అంత ఎక్కువ కాదు. స్మార్ట్ ఫోన్ ధరలో 40 శాతం టచ్ స్క్రీన్ మాత్రమే ఉంటుంది. టచ్ స్క్రీన్ ను ఇండియం టిన్ ఆక్సైడ్ తో తయారు చేస్తారు. దీని ధర ఎక్కువ. దీనికి విపరీతమైన డిమాండ్ ఉంది. ఎందుకంటే ప్రతి ఎలక్ట్రానిక్ వస్తువులోనూ టచ్ స్క్రీన్ వినియోగిస్తుండడంతో దీనికి డిమాండ్ పెరిగి, దీని ధరకు రెక్కలు వచ్చాయి. దీంతో పెన్సిల్వేనియా యూనివర్సిటీ లోహవిభాగం పరిశోధకులు పలు పరిశోధనలు నిర్వహించారు. ఈ పరిశోధనల్లో స్ట్రాంటియం వనడేట్ అనే పారదర్శక లోహాన్ని కనుగొన్నారు. దీనిని స్ట్రాంటియం వనడేట్, కాల్షియం వనడేట్ లలోని ఎలక్ట్రాన్లు ద్రవస్థితిలో ఉండి, పారదర్శకతతో విద్యుత్ వాహంగా పనిచేస్తున్నట్టు గుర్తించారు. దీనిపై మరికొందరు శాస్త్రవేత్తల సహాయంతో పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం తయారీ రంగంలో ఈ లోహం ఉపయోగంపై ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కేజీ బరువు గల ఇండియం టిన్ ఆక్సైడ్ ధర 750 డాలర్లు ఉండగా, కేజీ బరువు గల స్ట్రాంటియం వనడేట్ ధర కేవలం 25 డాలర్లు మాత్రమే. ఇది వినియోగంలోకి వస్తే స్మార్ట్ ఫోన్ ధరలన్నీ ఉన్నపళంగా కిందికి రావాల్సిందే.

More Telugu News