: ఇండియాలో అనుకున్నంత వృద్ధి నమోదు కాబోదన్న ఆర్థిక శాఖ!

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలుత ఆశించినంత మేర స్థూల జాతీయోత్పత్తి వృద్ధి నమోదు కాబోదని ఆర్థిక శాఖ తన తాజా నివేదికలో వెల్లడించింది. మార్చి 2016తో ముగిసే సంవత్సరంలో 7 నుంచి 7.5 శాతం మేరకు జీడీపీ పెరుగుతుందని అంచనా వేసింది. ఈ మేరకు మోదీ సర్కారు శుక్రవారం నాడు మధ్యంతర ఆర్థిక సమీక్షా నివేదికను పార్లమెంట్ ముందు ఉంచింది. ఇందులోని వివరాల ప్రకారం, గత ఫిబ్రవరిలో 8.1 నుంచి 8.5 శాతం జీడీపీ వృద్ధిని అంచనా వేయగా, మారిన పరిస్థితుల నేపథ్యంలో దాన్ని కుదించాల్సి వచ్చింది. ఆసియాలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న ఇండియా ఈ ఏడాది ఏప్రిల్ - సెప్టెంబరు మధ్య కాలంలో 7.2 శాతం జీడీపీని నమోదు చేసిన సంగతి తెలిసిందే. భారత ఆర్థిక వ్యవస్థ ముందుకు సాగుతున్నప్పటికీ, పలు సవాళ్లు ఎదురు నిలుస్తున్నాయని నివేదిక అభిప్రాయపడింది.

More Telugu News