: 'విముక్త' కథలు చాలా ప్రత్యేకమైనవి: కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు విజేత ఓల్గా

స్త్రీ వాద రచనలతో తెలుగు సాహితీ రంగంలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ రచయిత్రి ఓల్గా 2015 కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపికయ్యారు. ప్రస్తుత సమాజంలో స్త్రీలు ఎదుర్కొంటున్న ఆంక్షలు, అవమానాలు, హింసను ఇతివృత్తంగా తీసుకుని ఆమె రచించిన 'విముక్'త కథా సంపుటి ఈ పురస్కారానికి ఎంపికైంది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, ‘విముక్త అనే కథలు చాలా ప్రత్యేకమైనవి. ఈ పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ కథల గురించి చెప్పాలంటే.. ప్రత్యేకమైనవి, ఒక పద్ధతిలో రాసినవి. దీంట్లో స్త్రీలకు సంబంధించిన అనేక విషయాలు ఉంటాయి. అవి.. స్త్రీలు తమ మీద తాము అధికారం ఎలా సంపాదించుకోవాలి? తమ అస్థిత్వాన్ని ఎట్లా గుర్తుంచుకోవాలి? తమ అస్థిత్వ పోరాటాలు ఎలా చెయ్యాలి? స్త్రీల మధ్య పరస్పరం సహకార భావన ఎలా పెంపొందించుకోవాలి? స్త్రీలు ఒకరి అనుభవాల నుంచి ఒకరు ఎలా నేర్చుకోవాలి? ఇవన్నీ కూడా ఈ కథల్లో చర్చించాను’ అని ఓల్గా పేర్కొన్నారు.

More Telugu News