: ముందుకు రాకపోతే 2,600 ఖాతాల్లోని డబ్బు ప్రభుత్వానికే చెందుతుంది... స్విస్ బ్యాంకుల హెచ్చరిక

స్విస్ బ్యాంకులు చివరి హెచ్చరికలు జారీ చేశాయి. ఇప్పుడు ముందుకు వస్తేనే ఆ ఖాతాలలో సొమ్ము వారికి చెందుతుందని, లేని పక్షంలో ఆ మొత్తం సొమ్ము ప్రభుత్వ పరమవుతుందని స్విస్ బ్యాంకులు హెచ్చరిస్తున్నాయి. స్విస్ బ్యాంకుల్లో ఖాతాలు ఓపెన్ చేసి 60 ఏళ్లుగా 2,600 మంది ఖాతాదారులు స్తబ్ధుగా ఉన్నారు. వారి పేర్లను ప్రకటించిన స్విస్ బ్యాంకులు ఈ ఖాతాలలో డబ్బులు చేజిక్కించుకునేందుకు ఇదే చివరి అవకాశమని, ఇంకా స్పందించని పక్షంలో ఆ ఖాతాలలో గల మొత్తం డబ్బు ప్రభుత్వానికి చెందుతుందని తెలిపింది. 1955 నుంచి ఇప్పటి వరకు స్విస్ బ్యాంకుల్లో 44 మిలియన్ డాలర్లు సొమ్ము మూలుగుతోందని, ఖాతాదారులను గుర్తించేందుకు ఇదే సరైన, చివరి అవకాశమని స్విస్ బ్యాంకర్ల అసోసియేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ క్లాడ్ అలైన్ తెలిపారు.

More Telugu News