: కొత్త తరానికి అందనున్న కొత్త ‘స్మార్ట్’ ఫీచర్లు!

కొత్త తరానికి సరికొత్త స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి రానున్నాయి. కొత్త ఫీచర్లతో రూపొందుతున్న సుమారు పది కంపెనీల స్మార్ట్ ఫోన్లు వచ్చే ఏడాదిలో మార్కెట్ లోకి రానున్నట్లు తెలుస్తోంది. అంతకంటే ముందు, ఐ ఫోన్ 5సీ స్థానంలో ఐఫోన్ 6సీ మార్కెట్లోకి రానుంది. రంగురంగుల మోడల్స్ తో రానున్న ఈ ఫోన్ కు 5ఎస్, యాపిల్ పే సపోర్టు వంటి ఫీచర్లు ఉండనున్నాయి. ఆయా కంపెనీల నుంచి మార్కెట్లోకి విడుదల కానున్న స్మార్ట్ ఫోన్లలోని ఫీచర్లు... యాపిల్ ఐ ఫోన్ 7/ఐ ఫోన్ 7 ప్లస్/ఐ ఫోన్ 6సీ: వచ్చే ఏడాది సెప్టెంబర్ లో యాపిల్ ఐ ఫోన్ 7/ఐ ఫోన్ 7 ప్లస్ ఫోన్లను విడుదల చేసేందుకు కసరత్తు జరుగుతోంది. ఈ ఫోన్లలో అప్ గ్రేడెడ్ హార్డ్ వేర్ (జిపియర్ ప్రాసెసర్, మరింత సామర్థ్యం ఉన్న ర్యామ్.. మొదలైనవి), కొత్త హెడ్ ఫోన్ కనెక్టర్, పెద్దది, మెరుగైన స్క్రీన్, వాటర్ ప్రూఫింగ్ వంటి మొదలైన ఫీచర్లు ఉన్నాయి. ఎల్ జీ జీ5: 4కే డిస్ ప్లే, పేమెంట్ సర్వీస్, ఏ20-మెగా పిక్సెల్(ఎంపీ) కెమెరా, హోల్డ్ యువర్ బ్రీత్, ఐరిస్ స్కానర్ వంటి ఫీచర్లతో పాటు 3గిగా హెడ్జ్ స్పీడ్ మీద నడిచే స్నాప్ డ్రాగన్ 820 ప్రాసెసర్, రిమూవేబుల్ 4,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నట్లు తెలుస్తోంది. హెచ్ టీసీ ఒన్ ఎం10: 4కే అల్ట్రా హై డెఫినిషన్ డిస్ ప్లే, 3,500 ఎంఏహెచ్ బ్యాటరీ, స్నాప్ డ్రాగన్ 820 ప్రాసెసర్, యూఎస్బీ టైప్-సీ కనెక్టర్ తో పాటు మెరుగైన కెమెరా కూడా ఉండనున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ ఫోన్లతో పాటు నెక్స్ట్ బిట్ రాబిన్, జియామి ఎంఐ5, మైక్రోసాఫ్ట్ సర్వీస్ ఫోన్, సోనీ ఎక్స్ పీరియా జెడ్6, బ్లాక్ బెర్రీ వియన్నా/వెనిస్, సామ్ సంగ్ గెలాక్సీ ఎస్7 ఎడ్జ్ వంటి స్మార్ట్ ఫోన్లు కూడా సరికొత్త ఫీచర్లతో వచ్చే ఏడాది మార్కెట్ లోకి రానున్నట్లు సమాచారం.

More Telugu News