: ఆన్ లైన్ లో వజ్రాలు కొంటున్న భారతీయులు!

ఆన్ లైన్ ద్వారా సెల్ ఫోన్లు, పెన్ డ్రైవ్ లు, కంప్యూటర్ పరికరాలు, పలు ఎలక్ట్రానిక్ వస్తువులు, పుస్తకాలను వినియోగదారులు అధిక సంఖ్యలో కొనుగోలు చేస్తుంటారు. రిస్ట్ వాచ్ లు, షూలు, మ్యూజిక్ సీడీలు వంటి వస్తువులకు ఆన్ లైన్ ఆర్డర్లు బాగానే ఉంటాయన్న విషయం తెలిసిందే. తాజాగా, ఆన్ లైన్ లో డైమండ్స్ విక్రయాలు కూడా ప్రారంభమయ్యాయి. అందుకు వేదికగా వెల్వెట్ కేసు.కామ్ అనే భారతీయ ఈ-కామర్స్ సంస్థ నిలిచింది. ఈ సంస్థ కో-ఫౌండర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ కపిల్ హీతమ్ సారియా ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఆన్ లైన్లో డైమండ్స్ కొనుగోలు చేయడానికి వినియోగదారులు ఇప్పుడిప్పుడే ముందుకు వస్తున్నారన్నారు. వివాహ వేడుకకు సంబంధించి రూ.1.4 కోట్ల విలువ చేసే జ్యుయలరీని ఇటీవల ఒక వినియోగదారుడు ఆన్ లైన్ లో కొనుగోలు చేశారని చెప్పారు. భారీ మొత్తంలో కొనుగోలు చేసే ఆన్ లైన్ వినియోగదారులపై తాము ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తామని, తమ సంస్థకు చెందిన అసెట్ మేనేజర్ ఇవన్నీ దగ్గరుండి చూసుకుంటారని ఆయన చెప్పారు.

More Telugu News