: మారిన 'చెక్ బౌన్స్' చట్టం... ఆమోదించిన పార్లమెంట్

ఎవరో ఇచ్చిన చెక్కు తీసుకుని, అది బౌన్స్ కాగా, కేసు పెట్టేందుకు చెక్కు జారీ చేసిన బ్యాంకు లేదా చెక్కిచ్చిన వ్యక్తి ఉన్న ప్రాంతంలోని కోర్టులను ఆశ్రయించాల్సిన అగత్యం తప్పింది. ఇకపై చెక్కును జమ చేసిన బ్యాంకు ఉన్న ప్రాంతంలోనే, చెక్ బౌన్స్ కేసు పెట్టవచ్చు. ఈ మేరకు ఆర్థిక శాఖ సహాయమంత్రి జయంత్ సిన్హా రాజ్యసభలో ప్రవేశపెట్టిన చట్ట సవరణ బిల్లుకు ఆమోదం లభించింది. ఇదే బిల్లుకు గతంలో లోక్ సభ ఆమోదం పలికినప్పటికీ, రాజ్యసభలో అడ్డంకులు ఎదురైన సంగతి తెలిసిందే. ఇప్పుడిక రాజ్యసభ కూడా ఆమోదించడంతో చెక్ బౌన్స్ చట్టం మారినట్లయింది. కాగా, ప్రస్తుతం దేశంలోని వివిధ కోర్టుల్లో 18 లక్షలకు పైగా చెక్ బౌన్స్ కేసులు విచారణ దశలో ఉన్నాయి.

More Telugu News