: గ్రీన్ టీ తీసుకుంటున్నారా? అయితే కాస్త జాగ్రత్త!

ఈ మధ్య కాలంలో గ్రీన్ టీపై విస్తృత ప్రచారం జరుగుతోంది. దీంతో డైటింగ్ లో ఉన్నవారు, ఇతరులు ఆరోగ్యం కోసమంటూ గ్రీన్ టీ తాగేందుకు మక్కువ చూపుతున్నారు. అయితే గ్రీన్ టీ మంచిదని చెబుతున్న పరిశోధకులు, పరిమితి మించకుండా మాత్రమే తాగాలని సూచిస్తున్నారు. కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు గ్రీన్ టీ సేవనంపై పరిశోధనలు నిర్వహించారు. తమ పరిశోధనల్లో గ్రీన్ టీ మనుషులపై ఎలాంటి ప్రభావం చూపనప్పటికీ, కీటకాలపై దుష్ప్రభావం చూపిందని వారు వెల్లడించారు. ప్రకృతి సహజంగా లభించే వేటినైనా పరిమితంగా తీసుకుంటే మేలు చేస్తాయని తెలిపిన పరిశోధకులు పరిమితికి మించి తీసుకుంటే దుష్ప్రభావం తప్పదని గుర్తించాలని సూచించారు. మితంగా తీసుకుంటే మంచి ఫలితాలు ఉన్నాయని వారు వెల్లడించారు. దీంతో ఎక్కువ సార్లు టీ తాగే అలవాటున్నవారు గ్రీన్ టీని ఎక్కువ సార్లు తాగకుండా ఉంటే మంచిదని వారు సూచించారు.

More Telugu News