: ఆశ్చర్యం... ఆరేళ్ల నాటి ఈ ఫోన్, ఆండ్రాయిడ్ మార్ష్ మాలోకు అప్ డేట్ అవుతోంది!

ఆరేళ్ల క్రితం హెచ్టీసీ విడుదల చేసిన హెచ్డీ2... అప్పట్లో స్మార్ట్ ఫోన్ ప్రపంచంలో అదో సంచలనం. ఆ తరువాత అంతకన్నా తక్కువ ధరలో దానికి మించిన ఫీచర్లతో కూడిన ఎన్నో ఫోన్లు మార్కెట్లోకి వచ్చాయి. అప్పటి హెచ్డీ2 ఫీచర్లున్న ఫోన్ ఇప్పుడు రూ. 5 వేల కన్నా లోపుగానే లభిస్తోంది. అయితేనేం, ఆ ఫోన్ క్వాలిటీ, రూపొందించిన సాంకేతికత ఎంతటి గొప్పదన్న విషయం ఇప్పుడు తెలిసొచ్చింది. తాజాగా, ఆండ్రాయిడ్ వర్షన్ లో గూగుల్ విడుదల చేసిన మార్ష్ మాలో ఆపరేటింగ్ సిస్టమ్ కు అతి సులువుగా అప్ డేట్ అవుతోంది. ఇదే విషయాన్ని సాఫ్ట్ వేర్ డెవలప్ మెంట్ వర్గాలు వెల్లడించాయి. తాము ఆరేళ్ల నాటి ఫోన్ లోకి సులువుగా మార్ష్ మాలో ఆపరేటింగ్ సిస్టమ్ ను ప్రవేశపెట్టామని, ఎటువంటి తేడా కనిపించలేదని వెల్లడించాయి. ఈ ఫోన్ ఆగస్టు 2010లో ఆండ్రాయిడ్ 2.2 వర్షన్ లో విడుదలైంది. ఆపై ఐదు నెలల తరువాత విండోస్ వర్షన్ లో మార్కెట్లోకి వచ్చింది.

More Telugu News