: ఈ సంవత్సరానికి అతిపెద్ద 'టెక్' బ్రాండులివే!

2015 సంవత్సరం మరో మూడు వారాల్లో ముగుస్తుంది. గడచిన నాలుగైదేళ్ల మాదిరిగానే ఈ సంవత్సరం కూడా టెక్నాలజీ బ్రాండ్లే ఆధిపత్యం చూపాయి. అయితే, హ్యూలెట్ పాకార్డ్ వంటి కొన్ని కంపెనీల భవిష్యత్ పై మాత్రం నీలినీడలు కమ్ముకోగా, ఆ సంస్థలు కొత్త మార్గాల అన్వేషణకు కదిలాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాపార సామ్రాజ్యాన్ని శాసిస్తూ, తమదైన రీతిలో సాగిన టాప్ టెక్నాలజీ బ్రాండ్ల వివరాలివి. (బ్రాండ్ వాల్యూ ఆధారంగా టాప్ పొజిషన్స్ లో ఉన్న టెక్నాలజీ ఆధారిత కంపెనీల వివరాలు) యాపిల్ - 2015లో ర్యాంకు 1, బ్రాండ్ విలువ 170.276 బిలియన్ డాలర్లు. 2014లో ర్యాంకు - 1, బ్రాండ్ విలువ 118.863 బిలియన్ డాలర్లు. గూగుల్ - 2015లో ర్యాంకు 2, బ్రాండ్ విలువ 120.314 బిలియన్ డాలర్లు. 2014లో ర్యాంకు - 2, బ్రాండ్ విలువ 107.349 బిలియన్ డాలర్లు. మైక్రోసాఫ్ట్ - 2015లో ర్యాంకు 4, బ్రాండ్ విలువ 67.67 బిలియన్ డాలర్లు. 2014లో ర్యాంకు - 5, బ్రాండ్ విలువ 61.154 బిలియన్ డాలర్లు. ఐబీఎం - 2015లో ర్యాంకు 5, బ్రాండ్ విలువ 65.095 బిలియన్ డాలర్లు. 2014లో ర్యాంకు - 4, బ్రాండ్ విలువ 72.244 బిలియన్ డాలర్లు. శాంసంగ్ - 2015లో ర్యాంకు 7, బ్రాండ్ విలువ 45.297 బిలియన్ డాలర్లు. 2014లో ర్యాంకు - 7, బ్రాండ్ విలువ 45.462 బిలియన్ డాలర్లు. అమేజాన్ - 2015లో ర్యాంకు 10, బ్రాండ్ విలువ 37.948 బిలియన్ డాలర్లు. 2014లో ర్యాంకు - 15, బ్రాండ్ విలువ 29.478 బిలియన్ డాలర్లు. ఇంటెల్ - 2015లో ర్యాంకు 14, బ్రాండ్ విలువ 35.415 బిలియన్ డాలర్లు. 2014లో ర్యాంకు - 12, బ్రాండ్ విలువ 13.153 బిలియన్ డాలర్లు. సిస్కో - 2015లో ర్యాంకు 15, బ్రాండ్ విలువ 29.854 బిలియన్ డాలర్లు. 2014లో ర్యాంకు - 14, బ్రాండ్ విలువ 30.936 బిలియన్ డాలర్లు. ఒరాకిల్ - 2015లో ర్యాంకు 16, బ్రాండ్ విలువ 27.283 బిలియన్ డాలర్లు. 2014లో ర్యాంకు - 16, బ్రాండ్ విలువ 25.980 బిలియన్ డాలర్లు. హెచ్పీ - 2015లో ర్యాంకు 18, బ్రాండ్ విలువ 23.056 బిలియన్ డాలర్లు. 2014లో ర్యాంకు - 16, బ్రాండ్ విలువ 23.758 బిలియన్ డాలర్లు. ఫేస్ బుక్ - 2015లో ర్యాంకు 23, బ్రాండ్ విలువ 22.029 బిలియన్ డాలర్లు. 2014లో ర్యాంకు - 29, బ్రాండ్ విలువ 14.349 బిలియన్ డాలర్లు. శాప్ - 2015లో ర్యాంకు 26, బ్రాండ్ విలువ 18.768 బిలియన్ డాలర్లు. 2014లో ర్యాంకు - 25, బ్రాండ్ విలువ 17.340 బిలియన్ డాలర్లు. ఈబే - 2015లో ర్యాంకు 32, బ్రాండ్ విలువ 13.940 బిలియన్ డాలర్లు. 2014లో ర్యాంకు - 28, బ్రాండ్ విలువ 14.358 బిలియన్ డాలర్లు. కెనాన్ - 2015లో ర్యాంకు 40, బ్రాండ్ విలువ 11.278 బిలియన్ డాలర్లు. 2014లో ర్యాంకు - 37, బ్రాండ్ విలువ 11.702 బిలియన్ డాలర్లు. ఆక్సెంచర్ - 2015లో ర్యాంకు 42, బ్రాండ్ విలువ 10.8 బిలియన్ డాలర్లు. 2014లో ర్యాంకు - 44, బ్రాండ్ విలువ 9.882 బిలియన్ డాలర్లు. సోనీ - 2015లో ర్యాంకు 58, బ్రాండ్ విలువ 7.702 బిలియన్ డాలర్లు. 2014లో ర్యాంకు - 52, బ్రాండ్ విలువ 8.133 బిలియన్ డాలర్లు. పానాసోనిక్ - 2015లో ర్యాంకు 65, బ్రాండ్ విలువ 6.436 బిలియన్ డాలర్లు. 2014లో ర్యాంకు - 64, బ్రాండ్ విలువ 6.303 బిలియన్ డాలర్లు. అడోబ్ - 2015లో ర్యాంకు 68, బ్రాండ్ విలువ 6.257 బిలియన్ డాలర్లు. 2014లో ర్యాంకు - 77, బ్రాండ్ విలువ 5.33 బిలియన్ డాలర్లు. (సోమవారం నాటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎక్స్ఛేంజ్ రేట్ రిఫరెన్సు ప్రకారం ఒక బిలియన్ డాలర్లు రూ. 6,683 కోట్లకు సమానం)

More Telugu News